పుట్టిన రోజు నాడు దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

పుట్టిన రోజు నాడు దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, బుద్ధా వెంకన్నలు ఉన్నారు. చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో బ్రమరాంబ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైదిక కమిటీ సభ్యులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనానంతరం అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం ఆలయ ఈవో భ్రమరాంబ అందజేశారు.


User: Telugu Samayam

Views: 38

Uploaded: 2022-04-20

Duration: 07:43

Your Page Title