BJP National Executive Meeting | జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ | ABP Desam

BJP National Executive Meeting | జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా హైదరాబాద్ | ABP Desam

BJP జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. జులై 2, 3 తేదీల్లో హైటెక్స్ సమావేశాలు నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీటి కోసం బీజేపీ కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశించడం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో ముఖ్యమైన నేతల్ని కలవడం, ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధాని దేవేగౌడ, కుమార స్వామిని కలవడం వంటివి చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చి, కేసీఆర్ కుటుంబంపై నేరుగా విమర్శలు చేశారు. అంతకుముందు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అమిత్ షా కూడా తెలంగాణకు వచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. వీటి కోసం బీజేపీ కసరత్తును ప్రారంభించింది. ఈ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. జులై నెలలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.


User: Abp Desam

Views: 1

Uploaded: 2022-06-02

Duration: 05:43

Your Page Title