ఆ ఒక్కడు వచ్చి మమ్మల్ని ఆగం జేసిండు , హాంగ్ ‌కాంగ్ కెప్టెన్ *Cricket | Telugu OneIndia

ఆ ఒక్కడు వచ్చి మమ్మల్ని ఆగం జేసిండు , హాంగ్ ‌కాంగ్ కెప్టెన్ *Cricket | Telugu OneIndia

IND vs HK - Hong Kong captain Nizakat Khan Says The way Suryakumar batted was good to watch | డెత్ ఓవర్లలో దారళంగా పరుగులివ్వడంతోనే భారత్ చేతిలో ఓటమిపాలయ్యామని హాంగ్‌ కాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ అన్నాడు. ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తమని ఆగం జేసిండని తెలిపాడు. బుధవారం ఏక పక్షంగా సాగిన పోరులో హాంగ్ కాంగ్ 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన హాంగ్ కాంగ్ సారథి నిజకత్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో 13వ ఓవర్ వరకు తమ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారని, కానీ సూర్య రాకతో పరిస్థితులన్నీ మారిపోయాయన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ఓడినా. సూర్య ఆడిన విధానాన్ని ఆస్వాదించామని చెప్పిన నిజకత్ ఖాన్.. అతని అసాధారణ బ్యాటింగ్‌ తమల్ని మంత్ర ముగ్దుల్ని చేసిందని కొనియాడాడు.


User: Oneindia Telugu

Views: 2.5K

Uploaded: 2022-09-01

Duration: 01:01

Your Page Title