పోలవరం ప్రాజెక్టు దస్త్రాలు దగ్ధం - ఎన్డీఏ ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు దస్త్రాలు దగ్ధం - ఎన్డీఏ ఆగ్రహం

Polavaram Project Files Burnt: మదనపల్లె ఫైల్స్ విచారణ కొనసాగుతుండగానే ఇప్పుడు పోలవరం ఫైల్స్ దగ్దం కలకలం సృష్టిస్తోంది. పీపీఏ కార్యాలయంలో దస్త్రాలు దగ్ధం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిరాక్స్‌ పేపర్లు తగులబెట్టినట్లు రాజమండ్రి ఆర్డీవో శివజ్యోతి ప్రకటించడంపై ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. తగులబడిన దస్త్రాలను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్న దశలో ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. తగులబడిన దస్త్రాలను జేసీ చిన్నరాముడు, ఎస్పీ నరసింహ కిశోర్‌ పరిశీలించారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2024-08-18

Duration: 03:03