"మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా?": సీఎం

"మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా?": సీఎం

CM Chandrababu Fire on Ministers : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్నిప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదైనా సంఘటన జరిగితే ఎందుకు వేగంగా స్పందించడం లేదని నిలదీసినట్లు సమాచారం. విజయనగరం జిల్లా గుర్ల అతిసార ఘటనను ఇందుకు ఉదాహరణగా చూపించిన ఆయన జిల్లా మంత్రి, ఇంఛార్జి మంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఎందుకు స్పందించలేదని అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జిల్లా ఇంఛార్జి మంత్రులును నియమించి 15 రోజులైనా ఇంకా క్షేత్రస్థాయి పర్యటనలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారని తెలిసింది. పింఛన్లకు అర్హత నిర్ణయించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన ఆరంచెల పరిశీలన ఇకపై ఉండదని సీఎం స్పష్టం చేశారు.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2024-10-24

Duration: 03:46