పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu To Visit Polavaram Project Today : వైఎస్సార్సీపీ రివర్స్‌ విధానాలతో అస్తవ్యస్థంగా మారిన పోలవరానికి జవసత్త్వాలిచ్చి పనులను పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూలు విడుదల చేయనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్‌ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-12-16

Duration: 02:27