ఉద్దేశ్యపూర్వకంగా కలవలేదన్న ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ

ఉద్దేశ్యపూర్వకంగా కలవలేదన్న ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ

RTC Chairman Explains to Participation Gouthu Latchanna Program : వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌తో కలిసి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడంపై ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణ వివరణ ఇచ్చారు. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని అనుకోకుండా జరిగిందని తెలిపారు. పార్టీ శ్రేణులు అపార్థం చేసుకోవద్దని కోరారు. పార్టీకి ద్రోహం చేసే పని తానెప్పుడు చేయనని స్పష్టం చేశారు. ఎల్లప్పుడు పార్టీకి విధేయుడిగానే పని చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తో తనకు ఎటువంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. ఈ సంఘటనపై నారాయణ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2024-12-18

Duration: 01:52