ఫార్ములా-ఈ రేసు కేసు - ఏసీపీ విచారణకు కేటీఆర్ హాజర

ఫార్ములా-ఈ రేసు కేసు - ఏసీపీ విచారణకు కేటీఆర్ హాజర

KTR Attend ACB Inquiry in Formula E-Race Case : ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో బీఆర్​ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతిష్ఠను పెంచడానికి గతంలో మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని అన్నారు. బీఆర్​ఎస్ హయాంలో తన బావమరుదులకు రూ.1137 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వలేదని, కేబినెట్‌లో ఉండి తన కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదని తెలిపారు. తాను కాంట్రాక్టులు ఇచ్చి ప్రతిఫలంగా కార్లు కొనుక్కోలేదని, ఆ పనులు రేవంత్‌ రెడ్డి, వారి సహచర మంత్రులకే ఉన్నాయని అన్నారు. అరపైసా అవినీతి కూడా చేయలేదని ఆయన పేర్కొన్నారు.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-01-09

Duration: 02:28