పోలవరం ప్రాజెక్టు పునఃనిర్మాణం

పోలవరం ప్రాజెక్టు పునఃనిర్మాణం

New Diaphragm Wall at Polavaram : ఏపీ జీవనాడి పోలవరం పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్ట్ పునఃనిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ పనులను నేడు ప్రారంభించనున్నారు. సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపైనే ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్ పనులు కూడా ప్రారంభంకానున్నాయి.పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డ‌యాఫ్రం వాల్ కాంక్రీట్ నిర్మాణ ప‌నుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-18

Duration: 01:50