దావోస్​లో బిజీబిజీగా మంత్రి లోకేశ్

దావోస్​లో బిజీబిజీగా మంత్రి లోకేశ్

Minister Lokesh Davos Tour : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు దావోస్‌లో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండో రోజు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలకు సాంకేతిక సాయం, అమరావతి, విశాఖ, తిరుపతిల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల నిర్మాణం, మెరుగైన ఆరోగ్య ప్రమాణాల కోసం శిక్షణ వంటి రంగాల్లో సహకారం అందించాలని వివిధ రంగాల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూల స్పందన వచ్చింది.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-01-22

Duration: 02:29