ప్రేమ- పెళ్లి! ఆ తరువాత వ్యభిచార కూపంలోకి

ప్రేమ- పెళ్లి! ఆ తరువాత వ్యభిచార కూపంలోకి

Fraud In The Name of Love Marriage in Anakapalle District : ఆమెకు 17 ఏళ్ళు. ఉరకలెత్తే వయస్సులో ఉత్సాహంగా ఉండాల్సిన ఆ యువతి ఇప్పుడు అచేతనంగా కనిపిస్తోంది. ఉలుకూ పలుకూ లేకుండా కాళ్లు, చేతులు వంకర్లుపోయి కదల్లేని స్థితిలో పడిఉంది. 17 ఏళ్ల ప్రాయంలో జలపాతంలా పరుగెట్టాల్సిన ఆమె ప్రస్తుతం మానసిక ఆసుపత్రిలో జీవచ్ఛవంలా మారింది. ప్రేమ పేరుతో వల వేసి, పెళ్లిచేసుకుని ఆపై వ్యభిచార కూపంలోకి ఆమెను నెట్టాడో ప్రబుద్దుడు. ప్రాణాపాయ స్థితిలో ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తెలిసి తెలియని వయస్సులో ప్రేమ పేరుతో అమ్మాయిల జీవితాలతో చెలగాటమాడే వారు ఇంకా ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-01-29

Duration: 01:56

Your Page Title