ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్

ఎమ్మెల్యేకు న్యూడ్ వీడియో కాల్

Nude Call to MLA : నల్గొండ జిల్లా నకిరేకల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్​ నేరగాళ్ల నుంచి నగ్న వీడియో కాల్​ వచ్చింది. నగ్న వీడియో కాల్​ను సైబర్​ నేరగాళ్లు స్క్రీన్​ రికార్డింగ్​ చేశారు. స్క్రీన్​ రికార్డు చేసిన వీడియోను ఎమ్మెల్యే వీరేశం నంబర్​కు సైబర్​ నేరగాళ్లు పంపారు. డబ్బులు ఇవ్వకుంటే సోషల్​మీడియాలో వీడియో పెడతామంటూ బెదిరించారు. వాట్సాప్​ ద్వారా ఎమ్మెల్యేకు బెదిరింపు సందేశాన్ని సైబర్​ నేరగాళ్లు పంపారు. ఈ నగ్న వీడియో కాల్​ బెదిరింపులపై పోలీసులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఫిర్యాదు చేశారు. పోలీసుల సలహాతో సైబర్​ నేరగాళ్ల నంబర్​ను ఎమ్మెల్యే బ్లాక్​ చేశారు. సైబర్​ ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.


User: ETVBHARAT

Views: 9

Uploaded: 2025-03-05

Duration: 01:40

Your Page Title