భారత్​లో కమ్యూనిస్టు పార్టీ స్థాపించి ఇన్నేళ్లయినా - ఇంకా కమ్యూనిస్ట్​ దేశం కాలేదు : అజయ్​ ఘోష్

భారత్​లో కమ్యూనిస్టు పార్టీ స్థాపించి ఇన్నేళ్లయినా - ఇంకా కమ్యూనిస్ట్​ దేశం కాలేదు : అజయ్​ ఘోష్

Film Star Ghosh On communist parties : కమ్యూనిస్ట్​ పార్టీలపై ప్రముఖ సినీ నటుడు అజయ్​ ఘోష్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ అధికారంలోకి వస్తున్నాయి కానీ భారత్​లో పుట్టిన కమ్యూనిస్ట్​ పార్టీ మాత్రం అధికారంలోకి రాకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో ఎస్​ఎఫ్​ఐ, డివైఎఫ్​ఐ ఆధ్వర్యంలో భగత్​సింగ్​ యువజన ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. భగత్ సింగ్ రాజ్​గురు, సుఖ్​దేవ్​ల వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీలు, క్రీడల్లో విజేతలుగా నిలిచిన యువకులకు అజయ్ ఘోష్ బహుమతులను ప్రధానం చేశారు.


User: ETVBHARAT

Views: 13

Uploaded: 2025-03-23

Duration: 00:47