ప్రియురాలి కోపం ఖరీదు రూ. 19 లక్షలు

ప్రియురాలి కోపం ఖరీదు రూ. 19 లక్షలు

Woman Burnt Her Lover Bike in Visakha : విశాఖలో ఓ ప్రియురాలి కోపం రూ. 19 లక్షల మేర ఆస్తినష్టానికి దారి తీసింది. ప్రియుడు తనతో సన్నిహితంగా మెలగటం లేదనే కోపంతో అతని ఖరీదైన బైక్‌కు నిప్పు పెట్టింది. దీంతో పక్కనున్న 18 వాహనాలు కాలిపోగా మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి. మూడ్రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. జీవీఎంసీ (GVMC) లో విధులను నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తికి బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. అతను తనను పట్టించుకోవటం లేదని ఆ మహిళ ఆగ్రహంతో వాహనాలకు నిప్పు అంటించినట్లు నిర్థారించి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయస్థానం ఆ మహిళకు రిమాండ్ విధించింది.


User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-04-01

Duration: 01:51

Your Page Title