రికార్డులు సృష్టిస్తున్న గుంటూరు రైల్వే డివిజన్

రికార్డులు సృష్టిస్తున్న గుంటూరు రైల్వే డివిజన్

Guntur Railway Division Freight Load : సరకు రవాణా వ్యవస్థలో రైల్వేల పాత్ర అత్యంత కీలకం. వాటికి అత్యధిక ఆదాయం వచ్చేది కూడా ఈ మార్గం ద్వారానే. అందుకే గుంటూరు రైల్వే డివిజన్‌ వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. గతిశక్తి టెర్మినళ్ల ద్వారా అధిక మొత్తంలో సరకు రవాణా చేస్తోంది. 2023-2024లో 3.364 మిలియన్‌ టన్నుల సరకులు రవాణా చేసి గత రికార్డులను అధిగమించింది. ఈ ఏడాది 2024-2025లో 3.451 మిలియన్‌ టన్నులు లోడ్‌ చేసి ఆ రికార్డునూ దాటేసింది. 2003 ఏప్రిల్‌ 1న గుంటూరు రైల్వే డివిజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న రికార్డులన్నింటిని తిరగరాస్తూ దక్షిణ మధ్య రైల్వేలోనే ప్రత్యేకత చాటుకుంటుంది.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-04-06

Duration: 04:36