చిన్నారికి పెద్ద కష్టం

చిన్నారికి పెద్ద కష్టం

Seven Years Old Girl Suffering With AML Cancer in AP : తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత కష్టమైనా చిరునవ్వుతో భరిస్తారు. అదే కష్టం తమ చిన్నారులకు వస్తే మాత్రం తల్లడిల్లిపోతారు. ఆ సమస్య నుంచి బిడ్డలు బయటపడే వరకూ విలవిల్లాడతారు. ఇదే రీతిలో ప్రాణానికి ప్రాణమైన తమ కన్నబిడ్డను కాపాడేకునేందుకు అనుక్షణం తపిస్తున్నారు ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన జంజనం గోపీకృష్ణ, సుజాత దంపతులు. ముగ్గురు చిన్నారులతో కళకళలాడుతున్న వారి కుటుంబంలో పెద్ద పాపకు క్యాన్సర్ మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. 7 ఏళ్ల హర్షిణి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అరుదైన క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తూ దాతల సహకారం కోసం ఎదురుచూస్తోంది.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-04-27

Duration: 03:37