వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు - దేవిచౌక్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు - దేవిచౌక్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

pDussehra Navaratri Celebrations At Rajamahendravaram: తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదే విధంగా పూజలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా  రాజమహేంద్రవరంలో ప్రఖ్యాతి గాంచిన  దేవీ చౌక్  ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.  92వ దసరా మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు కుంకుమార్చనలు విశేష పూజలు శాస్త్రవేత్తంగా నిర్వహించారు. దాంతో కుంకుమ పూజలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు.ppజిల్లాలోని దేవరపల్లిలోని మూడు బొమ్మల సెంటర్లో కొలువైన  శ్రీ సౌభాగ్య దుర్గాంబిక ఆలయంలో భక్తి శ్రద్ధతో పూజలు నిర్వహించారు. సుమారు గత 15 ఏళ్లుగా ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామంలో 400 మంది మహిళా భక్తులు కలశాలతో గోదావరి జలాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని ఆలయాలను కలిశాలతో సందర్శించి ర్యాలీగా వెళ్లి అభిషేకాలు చేశారు.


User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-09-26

Duration: 01:48

Your Page Title