ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద - ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు

ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద - ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు

pFlood Flow Continues from Upstream to Prakasam Barrage : గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణా నదికి భారీగా వరద ప్రవహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో ఉమ్మడి కృష్ణా జిల్లా జలవనరులశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి గుంటురు వెళ్లే వారధి వద్ద ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాల మేరకు 3 వేల ఇసుక బస్తాలను సిద్దం చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీలోని 69 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. జలవనరుల శాఖ అధికారులు నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి పనులను పరిశీలిస్తున్నారు. లంక గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


User: ETVBHARAT

Views: 15

Uploaded: 2025-09-30

Duration: 04:44