వంతెన కూలి టిప్పర్​ బోల్తా - డ్రైవర్​కు స్వల్పగాయాలు

వంతెన కూలి టిప్పర్​ బోల్తా - డ్రైవర్​కు స్వల్పగాయాలు

pBridge Collapsed in Krishna District: కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు వంతెన కూలింది. దోసపాడు చానల్ కాలువలో టిప్పర్ లారీ పడిపోయింది. అధిక లోడుతో టిప్పర్ లారీ రావడంతోనే వంతెన కూలింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వంతెన కూలడం వల్ల మండలంలోని పలు గ్రామాలకు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.ppగతంలో సైతం: పెదపారుపూడు మండలం ఈదుల మద్దాలి గ్రామ సమీపంలో వంతెన మధ్య భాగం కూలి ట్రాక్టర్‌ బోల్తా పడింది. దీంతో పెదపారుపూడి నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 8 నెలల కిందట వంతెన కుంగిపోవటంతో భారీ వాహనాలు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గుడివాడ-కంకిపాడు రహదారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఈ రహదారి గుండానే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. శిధిలావస్థకు చేరిన వంతెనకు మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు.


User: ETVBHARAT

Views: 6

Uploaded: 2025-11-15

Duration: 01:27