నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్​ప్రెస్​​ - ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్​ప్రెస్​​ - ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

pVande Bharat Launches  From Narsapur-Chennai: ఇకపై గోదావరి ప్రజలంతా రయ్​ రయ్​మంటూ వందేభారత్​ ట్రైన్​లో అతి తక్కువ సమయంలోనే వారి గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అప్పుడు సర్కార్​ రైలు మాత్రమే అందుబాటులో ఉండేది. దాంట్లో చాలా ఎక్కువ సమయం పట్టేది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చెన్నై నుంచి విజయవాడకు ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్​ను నరసాపురం వరకు నడిచేలా ఏర్పాట్లు చేసింది. ఈరోజు నరసాపురం-చెన్నై వందేభారత్ పట్టాలపై పరుగులు పెట్టింది. ఈ రోజు మధ్యాహ్నం నరసాపురం-చెన్నై వందేభారత్‌ రైలును కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ జెండా ఊపి ప్రారంభించారు. 20678 నంబరుతో నరసాపురం నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరిన వందే భారత్‌ రైలు రాత్రి 11 గంటల 45నిమిషాలకు చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు చేరుతుంది. తిరిగి 20677 నంబర్‌తో ఉదయం 5 గంటల 35 నిమిషాలకు చెన్నై నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు నరసాపురం చేరుకుటుంది. నరసాపురం నుంచి విజయవాడ మధ్య ఈ రైలు భీమవరం, గుడివాడ స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది. వందే భారత్‌ కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్థానికులు అందులో ప్రయాణించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-12-15

Duration: 01:07