తెలుగు telugu Cyber Crime Fake Mail ID Full HD Nallamothu

తెలుగు telugu Cyber Crime Fake Mail ID Full HD Nallamothu

సైబర్ నేరాలకు పాల్పడితే ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా చాలామందిలో ఉంటోంది. అలాగే బాధితులు కూడా సరైన help దొరకదేమోనని కామ్ గా ఉండిపోతున్నారు. ఈ నేపధ్యంలో టెక్నాలజీ రంగంలో 15 ఏళ్లుగా ఉండడం వల్ల నాకు తెలిసిన కొన్ని కేసులు, అవి పరిష్కారమైన తీరూ మిత్రులతో పంచుకుంటాను వీలువెంబడి! ఆ క్రమంలో ఇప్పుడో కేసు వివరాలు చెబుతాను.br br కేస్: br br ఒకతను ఓ మహిళ పేరుతో ఇ-మెయిల్ ఐడి సృష్టించుకుని, ఆ మెయిల్ ఐడితో 5 వెబ్ సైట్లలో "తాను ఓ కాల్ గర్ల్" ననీ, ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ సైతం పేర్కొన్నాడు. br br ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగింది: br br అతను ఏయే IPల నుండి మెసేజ్ లు పోస్ట్ చేశాడన్నది ISPల సహకారంతో, ఆయా వెబ్ సైట్ల వెబ్ మాస్టర్ logsలో ఆ వ్యక్తిచే పోస్ట్ చేయబడిన మెసేజ్ ల timestamp, ip అడ్రస్ లు, మెయిల్ సర్వర్లలోని ఆ అకౌంట్ యొక్క ఏక్టివిటీ రికార్డులు పోలీసులు తెలుసుకుని అతని అడ్రస్ పట్టుకుని అరెస్ట్ చేశారు. కాలేజీలో ఆ అమ్మాయి తన క్లాస్ మేట్ అనీ, పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకోలేదని ఇలా చేశాననీ పోలీసులతో చెప్పాడు.br br పడిన శిక్ష: br br IT Act 2000లోని US 67 సెక్షన్ ప్రకారం మరియు IPC 469, 509 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష అమలుపరచబడింది.


User: nallamothu

Views: 148

Uploaded: 2011-08-03

Duration: 03:21