Australia Ball Tampering : Steve Smith, Bancroft Struggling

By : Oneindia Telugu

Published On: 2018-03-26

132 Views

01:53

Smith and Warner stepped down from their leadership roles for the remainder of the third Test. Overnight Smith was banned for one test match by the International Cricket Council (ICC) and fined 100 per cent of his match.

ఆస్ట్రేలియా జట్టులో ప్రధాన మార్పు చోటు చేసుకుంది. టాంపరింగ్ వివాదంలో నిజాలు ఒప్పుకోవడంతో స్టీవ్ స్మిత్‌ను ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోమంటూ ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కమిషన్ ఆదేశించింది. దీంతో పాటుగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్‌లాండ్ స్మిత్ కెప్టెన్సీ తప్పుకుంటాడని కానీ, జట్టులో కొనసాగుతాడంటూ తెలిపారు. జట్టులో ఆడుతున్న వార్నర్ ట్యాంపరింగ్ వివాదం ముదిరిపోకముందే వైస్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకున్నాడు. సదరు కమిషన్ ఆదేశాలనుసారం స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం స్మిత్‌కు ఇదేం మొదటి సారేం కాదు. ఇంత జరిగినా స్మిత్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జట్టు గెలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. అంతేకానీ, తానేం తప్పుచేయాలేదంటూ చెప్పుకుంటున్నాడు.
శనివారం కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్‌ ఆటగాడు బెన్‌ క్రాప్ట్‌ మైదానంలో ప్రవర్తించిన తీరు కెమెరాల్లో రికార్డు అయింది. ఆసీస్ క్రికెటర్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్..బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. అప్పటికీ వెనుకంజలో ఉండటంతో బ్యాల్ ట్యాంపరింగ్ చేసి దక్షిణాఫ్రికా పరుగులు కట్టడి చేద్దామని ప్రయత్నించారు. కానీ చివరికి దొరికిపోయి తల దించుకున్నారు.

Trending Videos - 14 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 14, 2024