Intidonganu

By : Bijibilla Rama Rao

Published On: 2021-01-11

8 Views

04:17

Sudhanva Sankirtanam : Devotional Album : Singer : Vijay Vardhan : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS : ఇంటిదొంగను

"పల్లవి" : ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడట, ఆ
ఇంటిదొంగను పట్టించే ఈశ్వరుడే తానంట "2"

"అ.ప." : ఒంటిలోని మాలిన్యమును తొలగించే ఔషధమంట
మన ఇంటిలోని మాధుర్యమును తొలగనివ్వని సౌరభమంట "ఇంటి"

"చరణం" : సకల పోషణ కారణము నిక్కముగా నీ మనసేనంట
సకల మానసవికాసము ఆధారమె నీ మనసంట
ఆలోచనలను వెల్లువకు ఆనకట్ట నీ యోచనయంట
ఆనకట్టలేని నీ మనసే అనర్ధములకు వారధియంట "ఇంటి"

"చరణం" : మోక్షగామిగా మననినాడు బ్రతుకే యిక భీతియంట
భక్తియను వారధిని జేసుకొనుటయే రీతియంట “2”
మనసను కళ్ళెము నీ కరముననే యుండునంట
అల మాధవుడను మత్తేభము నీ కళ్ళెము నాపునంట "ఇంటి"