Manasu Ane Udyanavanamuna

By : Bijibilla Rama Rao

Published On: 2021-01-13

6 Views

05:42

Sudhanva Sankirtanam : Devotional Album : Singer : V. Sadasiva Sarma : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS :మనసు అనే ఉద్యానవనమున

"పల్లవి" : మనసు అనే ఉద్యాన వనమున, యిల
"మనిషి" యనే తోటమాలి యొకడు "2"

"అ.ప." : అక్షరమను విత్తనములు జల్లెను "2"
అవి మాటలుగా మొలకెత్తెను సంతసమొందెను "మనసు"

"చరణం": మాటలను తెచ్చెను, మూటలను గట్టెను
ఏమిచేయాలో తనకు తోచదాయెను "2"
మంచిమాటలతొ మనము మంచిని పంచవలెను
మంచిధాన్యముగనవి ఉపయోగము గావలెను మనసు"

"చరణం" : క్షేత్రమను లోకమున పరమాత్ముని గాంచుమా!
ధాన్యమను పదములను యాతని కంకితమీయుమా!
కీర్తన యను ధాన్యరాశితో నీవు వండుమా! ఆ
దేవదేవునికి తృప్తిగ కడుపు నింపుమా! "మనసు"

చరణం" : నగధరుని ఆజ్ఞ లేని నగుమోము గానము, ఆతడి
అనుజ్ఞలేని జన్మము కానగ కాననము “2”
మహిమోపేతములే మహీధరుని మహిమలు
మోహనాశములు, అతడు కురిపించు నగవులు "మనసు"

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024